శాడిస్ట్‌ భర్త చేతిలో భార్యకు చిత్రహింసలు | Husband Tortured Wife In Shaikpet | Sakshi
Sakshi News home page

శాడిస్ట్‌ భర్త చేతిలో భార్యకు చిత్రహింసలు

May 25 2018 7:56 PM | Updated on Jul 27 2018 2:18 PM

Husband Tortured Wife In Shaikpet - Sakshi

బాధితురాలు జ్ఞానజ్యోతి

హైదరాబాద్ : షేక్‌పేటలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. స్థానికంగా నివాసముంటున్న ప్రశాంత్‌, జ్ఞానజ్యోతి భార్యభర్తలు. అదనపుకట్నం కోసం భార్య జ్ఞానజ్యోతిని భర్త ప్రశాంత్‌ కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శుక్రవారం భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. జ్ఞానజ్యోతి కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టాడు.

 తీవ్రంగా గాయపడిన జ్యోతి షేక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు జ్ఞానజ్యోతి ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. నిందితుడు ప్రశాంత్, అతని తల్లి, అన్నలపై జ్యోతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement