భార్యతో అఫైర్‌.. అనుమానించి స్నేహితుడిని చంపాడంట!

 Husband Kills Friend after Suspecting Affair with Wife - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  గత వారం నగరం దక్షిణ ప్రాంతంలోని సయిద్‌ ఉల్‌ అజయిబ్‌ ప్రాంతంలో సంచలనం రేపిన హత్య ఉదంతం మిస్టరీని పోలీసులు చేధించారు. ఓ వ్యక్తిని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన కేసులో అంతా అనుమానించినట్లుగానే స్నేహితుడే హంతకుడిగా తేల్చారు.

పరారీలో ఉన్న అతనిని చివరకు ఒడిశాలో పట్టుకున్నట్లు దక్షిణ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. విచారణలో ముందు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు యత్నించినప్పటికీ.. తర్వాత నిజం ఒప్పుకున్నట్లు వారు చెప్పారు. ఇక తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతోనే స్నేహితుడు విపిన్‌ జోషిని దారుణంగా హత మార్చినట్లు బాదల్ అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

గార్డెన్‌ ఆఫ్ పైవ్‌ సెన్సెస్‌ ప్రాంతంలో ఎఫ్‌ఐవో కంట్రీ చికెన్‌ అండ్ బార్‌లో ప్రాణ స్నేహితులైన విపిన్‌ జోషి, బాదల్‌ మండల్‌లు పని చేసే వారు. అయితే తన భార్యతో చనువుగా ఉండటం.. తాను లేని సమయంలో కూడా విపిన్‌ తరచూ తన ఇంటికి వెళ్తుండటం బాదల్‌ గమనించాడు. దీంతో తన భార్యతో వ్యవహారం నడుపుతున్న స్నేహితుడిని మట్టుపెట్టేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. అక్టోబర్ 9న తాను అద్దెకు ఉంటున్న గదిలో దావత్ ఇస్తానంటూ విపిన్‌ను ఆహ్వనించాడు.

ఆపై చిత్తుగా తాగిన విపిన్‌ను అప్పటికే తెచ్చిపెట్టుకున్న మాంసం కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై బాత్‌రూమ్‌లోకి లాక్కెల్లి శవాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జిలో దాచి.. ఏమీ ఎరుగనట్లు కోల్‌కతా పారిపోయాడు. అక్కడి నుంచి ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తలదాచుకోగా.. వారిచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top