వేధింపులకు తాళలేక బలవన్మరణం | Husband Harassment Wife Suicide Attempt Rangareddy | Sakshi
Sakshi News home page

వేధింపులకు తాళలేక బలవన్మరణం

Jan 16 2019 10:19 AM | Updated on Jan 16 2019 10:19 AM

Husband Harassment Wife Suicide Attempt Rangareddy - Sakshi

చాకలి మంజుల మృతదేహం మంజుల (ఫైల్‌)  

పెద్దేముల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పెద్దేముల్‌ ఎస్‌ఐ సురేశ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మంబాపూర్‌ గ్రామానికి చెందిన చాకలి మంజుల (31), శ్రీనివాస్‌ దంపతులు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. 

అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రోజు భర్త శ్రీనివాస్‌ మద్యం సేవించి భార్య మంజులను వేధిస్తుండేవాడు. ఆదివారం కూడా భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన మంజుల అర్ధరాత్రి ఇంట్లో దులానికి కట్టుకున్న చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు మంజుల కోసం చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది.

వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని కిందకుదించి పోస్ట్‌మార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి పాండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త వేధింపులతోనే తన కూతురు మంజుల ఆత్మహత్య చేసుకుందని పాండయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలికి కుమారులు అభిషేక్, విష్ణువర్దన్‌ ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement