
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధ వ్యవహారంలో భార్య ప్రియుడిపై దాడి చేసిన భర్తతో పాటు మరో ముగ్గురిని ఆదివారం చెన్నై ట్రిప్లికేన్ పోలీసులు అరెస్టు చేశారు. నడుకుప్పంకు చెందిన విజయకాంత్ (45) వ్యాపారి. ఇతని భార్య గత 15 సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో ఇతను ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇతనికి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు రంగన్ భార్య చిత్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రంగన్ తన బంధువు శరవణన్, ఆయన కుమారుడు అరవింద్‌తో కలిసి విజయకాంత్‌పై ఆదివారం ఉదయం దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయకాంత్ ప్రాణాపాయ స్థితిలో చెన్నై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన ముగ్గురిని అరెస్టు చేశారు.