భాగస్వామిని కడతేర్చాడు.. | Homosexual Relationship Leads To Murder In Mumbai | Sakshi
Sakshi News home page

భాగస్వామిని కడతేర్చాడు..

Feb 7 2020 4:33 PM | Updated on Feb 7 2020 4:35 PM

Homosexual Relationship Leads To Murder In Mumbai - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అసహజ బంధాన్ని కొనసాగించమనడంతో భాగస్వామిని కడతేర్చిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.

ముంబై : నగరంలోని దొంబివ్లి సమీపంలోని రైల్వే పట్టాల వద్ద సూట్‌కేసులో లభ్యమైన 57 ఏళ్ల వ్యక్తి మృతదేహానికి సంబంధించిన మిస్టరీ వీడింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన బాధితుడిని అతని హోమోసెక్సువల్‌ భాగస్వామే హత్య చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. సూట్‌కేసులో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను బట్టి మృతుడిని ఉమేష్‌ పాటిల్‌గా పోలీసులు గుర్తించారు. కేవలం 9 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. పాటిల్‌ను 27 ఏళ్ల ప్రఫుల్‌ పవార్‌ హత్య చేసినట్టుగా కనుగొన్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా స్వలింగ సంపర్కానికి పాల్పడుతున్నారని తెలిపారు.

నవీముంబైలో ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న పాటిల్‌ రెండు రోజులుగా కోప్రి ప్రాంతంలోని తన ఇంటి నుంచి అదృశ్యమైనట్టు ఫిర్యాదు అందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అవివాహితుడైన పవార్‌కు పాటిల్‌తో ఆరు నెలల కిందట లోకల్‌ ట్రైన్‌లో కలిగిన పరిచయం ఆ తర్వాత ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కానికి దారితీసింది. కాగా ఇటీవల పవార్‌కు వివాహం కావడంతో పాటిల్‌ను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. రెండు రోజుల కిందట పవార్‌ ఇంటికి వెళ్లిన పాటిల్‌ ఇదే విషయంపై నిలదీయడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన పవార్‌ పాటిల్‌ను హతమార్చి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి రైల్వే ట్రాక్‌ల వద్ద పడేసి పారిపోయాడు.

చదవండి : అంతమొందించి.. అంతులేకుండా వెళ్లాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement