మొబైల్‌ ఆప్‌ ద్వారా సెక్స్‌ రాకెట్‌ దందా.. అరెస్ట్‌ | Hitech Sex Racket Arrest In Ranchi | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఆప్‌ ద్వారా సెక్స్‌ రాకెట్‌ దందా.. అరెస్ట్‌

Jul 22 2018 4:49 PM | Updated on Jul 23 2018 8:51 PM

Hitech Sex Racket Arrest In Ranchi - Sakshi

మొబైల్‌ ఆప్ ద్వారా రూం బుక్‌ చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు 

రాంచీ : జార్ఖండ్‌లో హైటెక్‌ వ్యభిచారం ముఠా గుట్టురట్టయ్యింది. ఆన్‌ లైన్‌ ద్వారా రెసిడెన్షియల్‌ ఏరియాలో రూం బుక్‌ చేసుకొని అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాలుగు జంటలను రాంచీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంచీలోని వింద్ర ప్యాలెస్‌లో గత రెండు నెలలుగా సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నారు. కమర్షియల్‌ హోటల్‌ పేరిట ఓ కాంప్లెక్స్‌ను రెంట్‌కు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా సెక్స్‌ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు.

మొబైల్‌ ఆప్‌ ద్వారా రూంను బుక్‌ చేసుకొని అవివాహిత జంటలను గదిలోకి అనుమతిస్తారు. దీని కోసం వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా చుట్టుపక్కల వారి ఈ దందాను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసలు దాడులు నిర్వహించి నాలుగు జంటలను, ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ రాకెట్‌ వెనుక ఉన్న మరికొంత మందిని త్వరలోనే పట్టుకుంటామని పోలీలుల పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement