కర్నూలులో భారీ చోరీ.. కిలో బంగారం మాయం! | Heavy theft in kurnool | Sakshi
Sakshi News home page

Jan 13 2018 8:38 PM | Updated on Jan 13 2018 8:40 PM

Heavy theft in kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: పట్టణంలోని కృష్ణానగర్‌లో భారీ దొంగతనం జరిగింది. కృష్ణానగర్‌ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి దొంగలు కిలో బంగారం, రూ. 4 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ కాలనీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దొంగల భయంతో తాము హడలిపోతున్నామని అంటున్నారు.

కృష్ణా నగర్‌లోని రవీంద్ర స్కూల్ వెనుక వైపు రైల్వే ట్రాక్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారంతోపాటు పిల్లల ఫీజుల కోసం దాచి ఉంచిన నగదును దొంగలు దోచుకెళ్లారని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి నెల్లూరుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఇంటికి వేసిన తాళాలు తెరిచి ఉండటంతో ఉదయం పక్కింటివారు గుర్తించడంతో రాత్రి చోరీ జరిగిన వ్యవహారం వెలుగుచూసింది. ఘటనపై బాధితురాలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement