అమ్మా, నాన్నా నన్ను క్షమించండి | Health Problems Young Man Suicide In Medak | Sakshi
Sakshi News home page

అమ్మా, నాన్నా నన్ను క్షమించండి

Apr 27 2019 11:35 AM | Updated on Apr 27 2019 11:42 AM

Health Problems Young Man Suicide In Medak - Sakshi

మైలారం విఠల్‌ మృతదేహం, మృతుడి జేబులో  లభించిన సూసైడ్‌నోట్‌

కంగ్టి(నారాయణఖేడ్‌): దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నందున జీవితంపై విరక్తి కలిగింది. అందుకే... అమ్మా, నాన్నా మీ రుణం తీర్చుకోలేక పోతున్నాను. క్షమించండి.. అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకొన్నాడు కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన యువకుడు మైలారం విఠల్‌(23). స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ గ్రామానికి చెందిన మైలారం హన్మంతు భార్య రాజవ్వతో కలిసి గత వారంలో మెదక్‌ పట్టణానికి వలస కూలీ పనుల కోసం వెళ్లాడు. కాగా బుధవారం వారి కొడుకు విఠల్‌ మెదక్‌ చేరుకొన్నాడు.

గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు రాత్రి 9 గంటలకు చర్చి కాంపోండ్‌లో విగతజీవుడై కన్పించారు. డిగ్రీ చదువు పూర్తి చేసి గత రెండేళ్ల నుంచి హైదరాబాద్‌లో కంపెనీల్లో పని చేసేవాడు. ఆకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోధనకు అంతులేదు.  మృతుడి తండ్రి హన్మంతు మెదక్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement