తుపాకీ మిస్‌ఫైర్‌ ఇద్దరు గార్డులకు స్వల్పగాయాలు | Gun missfire in begumpet | Sakshi
Sakshi News home page

తుపాకీ మిస్‌ఫైర్‌ ఇద్దరు గార్డులకు స్వల్పగాయాలు  

Feb 4 2018 2:12 AM | Updated on Aug 21 2018 3:16 PM

Gun missfire in begumpet - Sakshi

గాయాలకు గురైన శ్రీనివాసులు, మహేశ్వరరావు, మిస్‌ఫైర్‌ అయిన గన్‌

హైదరాబాద్‌: విధి నిర్వహణలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యింది. తుపాకీలోని బుల్లెట్లను చెక్‌ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. మిస్‌ఫైర్‌ అయిన గన్‌లోని బుల్లెట్‌ నేలను కొట్టుకుని ముక్కలై పక్కనే ఉన్న ఇద్దరు గార్డులకు తగలడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్‌ బేగంపేట గురిమూర్తినగర్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి నగదును ఏటీఎం సెంటర్లతో పాటు ఇతర బ్రాంచ్‌లకు తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో భద్రత కోసం సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని చెక్‌మెట్‌ సెక్యూరిటీ సంస్థ గార్డ్‌ సురేశ్‌కుమార్‌ శనివారం ఉదయం బ్యాంకు వద్దకు వచ్చారు.

అతని వద్దనున్న లైసెన్స్‌డ్‌ డబుల్‌ బారెల్‌ గన్‌లో బుల్లెట్లను చూపాల్సిందిగా అక్కడి సెక్యూరిటీ అధికారి రామకృష్ణ అడిగారు. బుల్లెట్లను చూపించే క్రమంలో సురేశ్‌ చేతిలో ఉన్న తుపాకీ మిస్‌ఫైర్‌ అయ్యింది. బుల్లెట్‌ భూమిని తాకి ముక్కలై పక్కనే ఉన్న అదే సంస్థలో పనిచేసే తోటి గార్డులు శ్రీనివాసులు (40), మహేశ్వరరావు (45)లకు తగిలాయి. స్వల్ప గాయాలకు గురైన వీరిని చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement