లాక్‌డౌన్‌ నిందితునిపై తూటా

Gun Fire on Lockdown Accused in Karnataka - Sakshi

నిందితుడు, మహిళా ఎస్సైకి గాయాలు

కర్ణాటక, యశవంతపుర: లాక్‌డౌన్‌ తనిఖీల సమయంలో బుధవారం విధులలో ఉన్న పోలీసులపై దాడి చేసి పారిపోయిన యువకునిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన బెంగళూరులో జరిగింది. లాక్‌డౌన్‌ సందర్భంగా సంజయనగర భూపసంద్ర వద్ద చెక్‌పోస్ట్‌ను పెట్టివాహనాలను తనిఖీ చేశారు. బైకులపై వచ్చిన 10 మంది యువకుల పోలీసులు వాహనాలను తనికీ చేశారు. ఆగ్రహం చెందిన యువకులు పోలీసులు బసవరాజు, మంజునాథ్‌లపై దాడి చేసి పారిపోయారు.  

కాల్పులు జరిగాయిలా  
నిందితులను అరెస్ట్‌ చేయటానికి బుధవారం రాత్రి గాలించి ప్రధాన నిందితుడు తాజుద్దీన్‌తో పాటు 10 మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. గురువారం తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో నిందితున్ని సంజయనగర సీఐ జాలాజీ, మహిళా ఎస్‌ఐ రూపా, హెడ్‌ కానిస్టేబుల్‌ మంజునాథ్‌లు  మహజర్‌ కోసం ఘటనాస్థలిని పరిశీలించటానికీ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితుడు పోలీసులపై దాడి చేసి పారిపోవటానికి యత్నించాడు. లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోకుండా దాడి చేయటానికి యత్నించాడు. సీఐ బాలాజీ నిందితుడిపై కాల్పులు జరిపారు. నిందితుని కాలికి తూటా తగిలి అక్కడిక్కడే కుప్పకూలాడు. తక్షణం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. గాయాలైన నిందితుడు తాజుద్దీన్, ఎస్‌ఐ రూపా, హెడ్‌కానిస్టేబుల్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top