మైనర్‌పై అమానుషం: కాపాడాల్సిన తల్లే | Gujarat: mother helped 3 peopl to rape 12year-old daughter  | Sakshi
Sakshi News home page

మైనర్‌పై అమానుషం: కాపాడాల్సిన తల్లే

Dec 9 2019 12:41 PM | Updated on Dec 9 2019 12:54 PM

Gujarat: mother helped 3 peopl to rape 12year-old daughter  - Sakshi

భావనగర్‌ : గుజరాత్‌లో అమానుషం చోటు చేసుకుంది. మైనర్ బాలిక (12) పై ఏడాది పాటు ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్వయంగా బాలిక తల్లే ఈ కీచకులకు సహకరించడం విషాదం.   బిడ్డను కంటికి రెప్పలా కాపాడ్సాలిన తల్లే కన్నకూతురి పట్ల పరమ నీచంగా ప్రవర్తించింది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో పాలితానా తాలూకా భూటియా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.  

ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన బాలిక తండ్రిపోలీసులు ఫిర్యాదు చేశాడు. తన భార్యే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆరోపించారు. అటు తండ్రి బయటికి వెళ్లినపుడు తనపై అత్యాచారం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో  శనివారం  కేసు నమోదు చేసిన అధికారులు శాంతి ధంధుకియా (46), బాబుభాయ్ సర్తాన్‌పారా (43), చంద్రేష్ సర్తాన్‌పారా (32)  అనే ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు.  బాధితురాలి తల్లి పరారీలో ఉన్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో తండ్రి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు, ఈ వ్యవహారంలో తల్లిపాత్ర పై పూర్తి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement