యువతిపై తాత, మేనమామ లైంగిక దాడి | Grandfather And Uncle Molestation on Women in Hyderabad | Sakshi
Sakshi News home page

యువతిపై తాత, మేనమామ లైంగిక దాడి

Feb 4 2020 8:59 AM | Updated on Feb 4 2020 8:59 AM

Grandfather And Uncle Molestation on Women in Hyderabad - Sakshi

చాంద్రాయణగుట్ట: ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఆమె మేనమామ, తాతను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌ (70) మనుమరాలు(19) చిన్నతనం నుంచి వారి ఇంట్లోనే పెరిగింది. సదరు బాలికపై కన్నేసిన షేక్‌ అఫ్సర్‌ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె ఈ నెల 1న   చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.   తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement