బంగారు గొలుసు అపహరణ | Gold Chain Snached | Sakshi
Sakshi News home page

బంగారు గొలుసు అపహరణ

May 1 2018 1:12 PM | Updated on May 1 2018 1:12 PM

Gold Chain Snached - Sakshi

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాముడమ్మ

పార్వతీపురం : మహిళ మెడలోని మూడు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంచుకుపోయిన సంఘటన కొమరాడ మండలం గుణానపురంలో సోమవారం జరిగింది. పార్వతీపు రం ఔట్‌పోస్టు పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం... గుణానపురం గ్రామానికి చెందిన మిరియాల రాముడమ్మ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించి, రాముడమ్మ నోట్లో గుడ్డలు కుక్కి బండరాయితో తలపై మోదాడు.

దీంతో బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగ దోచుకుపోయాడు. తలుపులకు గడియ పెట్టి వెళ్లిపోవడంతో ఎవరికీ విషయం తెలియలేదు. కొన్ని గంటల తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి తలుపులు తెరవగా అపస్మారక స్థితిలో ఉన్న రాముడమ్మను గమనించి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు వైద్యసేవలందిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement