రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి.. | Girl, sexually assaulted in sulthanabad | Sakshi
Sakshi News home page

రేప్ చేసి వీడియోతీసి, సోషల్ మీడియాలో పెట్టి..

Jan 4 2018 12:22 PM | Updated on Oct 22 2018 6:05 PM

Girl, sexually assaulted in sulthanabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. సుల్తానాబాద్ లో ఓ యువతిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా రేప్ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ వీడియోను మరికొందరు యువకులు డౌన్ లోడ్ చేసుకుని బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించారు.

యువతికి వైద్య పరీక్షల కోసం పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి, లైంగిక దాడికి పాల్పడిన కదంపూర్ కు చెందిన బండి శ్రీనివాస్, పెద్ది నగేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని కాల్ డేటా సేకరిస్తున్నారు. లైంగిక దాడి వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ఎవరు, బ్లాక్ మెయిల్ కు పాల్పడింది ఎవరనే కోణంలో విచారణ జరుపుతన్నారు. కట్టెల కోసం గుట్టకు వెళితే ఇద్దరు యువకులు కూల్ డ్రింక్ తాగించారని, అనంతరం సోయిలేకుండా పడిపోయానని బాధిత యువతి పేర్కొన్నారు. అనంతరం తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మేలుకొని చూసేసరికి, వీడియో తీస్తుంటే అడ్డుకున్నానని తెలిపారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరారు. యువతి ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 67,  67a, 67b, 376 (D), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, 99 విత్ ఉమెన్ యాక్టు ప్రెజెంటేషన్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement