రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య  | Girl Commits Suicide Over Health Problem In mahabubnagar | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి విద్యార్థిని ఆత్మహత్య 

Feb 27 2020 11:06 AM | Updated on Feb 27 2020 11:06 AM

Girl Commits Suicide Over Health Problem In mahabubnagar - Sakshi

రోదిస్తున్న మృతురాలి తల్లి శిరీష, బంధువులు.. ఇన్‌సెట్లో అంకిత (ఫైల్‌) 

సాక్షి, దేవరకద్ర: ఓ విద్యార్థిని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. దేవరకద్రలోని కుర్వవాడకు చెందిన అంకిత (15) కు గతంలోనే తండ్రి మృతి చెందగా తల్లి శిరీషతో పాటు సోదరుడు ఉన్నారు. తల్లి స్థానికంగా కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తుండగా కూతురు స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలికల) లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కాగా, బుధవారం మధ్యాహ్నం సమీపంలోని పట్టాల వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ బాలిక ఈనెల 19 నుంచి పాఠశాలకు రావడం లేదని హెచ్‌ఎం చంద్రకళ తెలిపారు. ఇదిలాఉండగా అంకిత మూడు రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోందని, దీనివల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని రైల్వే పోలీసులకు తల్లి శిరీష ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement