
నవాబుపేట : గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఈ సంఘటన మండల పరిధిలోని మమ్మదాన్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జుంజుర అనంతయ్య భార్య అలివేలు ఉదయం 7 గంటలకు వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించింది. దీంతో మంటలు చెలరేగి రెగ్యులేటర్ నుంచి నేరుగా సిలిండర్ వరకు చెలరేగాయి.
దీంతో ఆమె భయాందోళనకు గురై కుటుంబసభ్యులకు విషయం కుటుంబీకులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది రాజు, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.