మూడు మృతదేహాలు ఒకే పాడెపై .. | Funeral to the three dead bodies | Sakshi
Sakshi News home page

మూడు మృతదేహాలు ఒకే పాడెపై ..

Feb 7 2018 2:14 AM | Updated on Oct 2 2018 5:51 PM

Funeral to the three dead bodies - Sakshi

సహస్త్ర, అభితేజ్‌లతో జ్యోతి(ఫైల్‌)

చందుర్తి(వేములవాడ): హైదరాబాద్‌లో భర్త చేతిలో హత్యకు గురైన జ్యోతి.. ఆమె ఇద్దరు పిల్లల మృతదేహాలను ఒకే పాడెపై ఉంచి మంగళవారం అంత్యక్రియలు జరిపారు. హైదరాబాద్‌ జిల్లెలగూడలో భర్త హరిందర్‌ చేతిలో భార్య జ్యోతి (32)తో పాటు ఇద్దరు పిల్లలు అభితేజ్‌(6), సహస్త్ర (4)లు సోమవారం  దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

జ్యోతి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి. గ్రామానికి చెందిన అబ్బగోని వజ్ర–సత్తయ్యల రెండో కూతురు జ్యోతి.  పోస్టుమార్టం అనంతరం ముగ్గురి మృతదేహాలను మంగళవారం ఇక్కడికి తీసుకొచ్చారు.  మూడు మృతదేహాలను ఒకేపాడెపై కట్టి గ్రామంలో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement