కారు దొంగ కోసం వెళ్తే...

French Police Officers Arrest Drugs Dealer When They Are In Undercover Operation - Sakshi

బాబిగ్నీ, ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్‌ పోలీసులు కారు దొంగను పట్టుకుందామని వెళ్తే మత్తు పదర్ధాలు అమ్మే వాళ్లు పట్టుబడ్డారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... బుధవారం సాయంత్రం ఉత్తర పారిస్‌ బాండీలో కొందరు పోలీసు అధికారులు కారు దొంగను పట్టుకోవడం కోసం సివిల్‌ దుస్తుల్లో మాటు వేసారు. ఆ సమయంలో మత్తు పదర్ధాలు అమ్మే ఇద్దరు వ్యక్తులు వీరిని సాధరణ మనుషులే అనుకుని వారి వద్దకు వచ్చి మత్తు పదర్ధాలు కావాలా అని అడిగాడు. ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయ్యింది. కానీ పోలీసులు వెంటనే తమ ఐడెంటిటీని బయట పెట్టకుండా వారి వద్ద నుంచి పూర్తి వివరాలు కూపీ లాగారు. అనంతరం తాము పోలీసులమని చెప్పి వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 67 కేజీల మత్తు పదర్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top