రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు  | Four Members Injured In Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు 

Apr 6 2018 11:18 AM | Updated on Aug 30 2018 4:20 PM

Four Members Injured In Road Accident - Sakshi

ప్రమాద దృశ్యం

ఇల్లెందురూరల్‌: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో వాటిలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు... ఇల్లెందులోని మయూరి హోటల్‌ వ్యాపారి లక్ష్మి, ఆమె భర్త రవీందర్‌ కలిసి కారులో కొత్తగూడెం నుంచి తిరిగొస్తున్నారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామంలోని సమ్మక్క–సారక్క గద్దెల వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది.

లక్ష్మి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న కారులోని మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రం గాయపడిన లక్ష్మిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement