కెనడా విజయోత్సవ ర్యాలీలో కాల్పుల కలకలం

Four Injured in Canada In Victory Rally - Sakshi

టోరంటో: కెనడాలోని టోరంటోలో ఓ విజయోత్సవ ర్యాలీపై దుండగులు కాల్పులు జరిపిన ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టోరంటోలోని సిటీహల్‌ స్క్వేర్‌లో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలమంది రాప్టార్‌ అభిమానులతో ఆ ప్రదేశమంతా నిండి ఉంది. ఇంతకు ముందు దీనిని ఒక మిలియన్‌ కంటే ఎక్కువ మంది వచ్చేలా ర్యాలీ కోసం ఏర్పాటు చేశారు.  అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో.. ఇదే అదునుగా భావించిన దుండగులు వారిపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా సిబ్బంది అలర్ట్‌ కావడంతో పెద్ద ప్రమాదమేనీ జరగలేదు.

ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. మరికొందరు స్వల్పంగా గాయాలపాలైనట్లు పోలీస్‌ చీఫ్‌ మార్క్‌ సాండర్స్‌ చెప్పారు. ఈ కాల్పుల సమయంలో ఎవరైన ఫోటోలు లేదా వీడియోలు తీసివుంటే వాటిని తమకుని అప్పగించి దర్యాప్తుకు సహకరించాలని సాండర్స్‌ కోరారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ దేశ ప్రధాని జస్టిస్‌ ట్రూడో, టోరంటో మేయర్‌ జాన్‌ టోరి, ఎన్‌బీఏ ఫైనల్స్‌ ఎంవిపి కవి లియోనార్ఢ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలేమీ కాలేదని అధికారులు తెలిపారు. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు చేశారా.. లేక తీవ్రవాదుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top