మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

Former South Africa Footballer Marc Batchelor Shot Dead - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు మార్క్‌ బ్యాచ్‌లర్‌(49) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు అతడిని కాల్చి చంపేశారు. వివరాలు.. సోమవారం ఉదయం జోహన్నస్‌బర్గ్‌లోని తన నివాసం నుంచి మార్క్‌ కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మార్క్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో అతడితో పాటు ముందుసీట్లో కూర్చున్న మరో వ్యక్తి కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు.

కాగా ఇంతవరకు హంతకుల జాడ తెలియలేదని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫుట్‌బాలర్‌ హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నామని వెల్లడించారు. ఇక దక్షిణాఫ్రికాలోని కైజర్‌ చీఫ్స్‌, ఓర్లాండో పైరేట్స్‌, మమెలోడి సన్‌డౌన్స్‌ ఫుట్‌బాల్‌ జట్లకు మార్క్‌ ప్రాతినిథ్యం వహించిన మార్క్‌ మృతి పట్ల ఆయా జట్ల యాజమాన్యాలు సంతాపం వ్యక్తం చేశాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top