గౌరీ లంకేశ్‌ను చంపింది వాగ్మారేనే

Forensic Lab Confirms Parashuram Waghmare Shot, Killed Gauri Lankesh - Sakshi

బెంగళూరు: హేతువాద రచయిత్రి గౌరీ లంకేశ్‌ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కీలక పురోగతి సాధించింది. గౌరీ లంకేశ్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపింది పరశురామ్‌ వాగ్మారే అని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధ్రువీకరించింది. కస్టడీలో ఉన్న వాగ్మారే వాంగ్మూలం ప్రకారం హత్యకు ముందు ఘటనలను వరుస క్రమంలో చిత్రీకరించిన ఊహా జనిత వీడియోతోపాటు, హత్య జరిగిన రోజు గౌరీ లంకేశ్‌ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని సిట్‌ గుజరాత్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీకి పంపగా, రెండింటిలో ఉన్న వ్యక్తి వాగ్మారే అని తేలింది. గత ఏడాది సెప్టెంబర్‌ 5వ తేదీన గుర్తు తెలియని దుండగులు గౌరీని ఆమె ఇంటి వద్ద కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న 12 మంది వ్యక్తులను సిట్‌ ఇప్పటివరకు అరెస్టు చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top