ఎయిర్‌పోర్టులో రూ.1.5 కోట్ల  విదేశీ కరెన్సీ పట్టివేత  | Foreign currency worth Rs. 1.5 crore in airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో రూ.1.5 కోట్ల  విదేశీ కరెన్సీ పట్టివేత 

Jan 19 2018 3:04 AM | Updated on Jan 19 2018 3:30 AM

Foreign currency worth Rs. 1.5 crore in airport - Sakshi

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం నగరానికి చెందిన వ్యక్తి దుబాయ్‌ వెళ్లేందుకు చెక్‌ఇన్‌ పూర్తి చేసుకుని విమానాశ్రయంలో వేచి ఉన్నాడు. ముందస్తు సమాచారం అందుకున్న డీఆర్‌ఐ (డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) అధికారులు కస్టమ్స్‌ అధికారులను అప్రమత్తం చేయడంతో అతడి లగేజీని తనిఖీ చేశారు.

దీంతో అతడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన ఒమన్, సౌదీ దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement