ఫుడ్‌ పాయిజన్‌

Food poison - Sakshi

మదర్సా విద్యార్థిని మృతి

మరో 13 మందికి అస్వస్థత

కుళ్లిన కూరగాయలు,పురుగులు పట్టిన పప్పులు, బియ్యం

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీల్లో బట్టబయలు

నివేదిక మార్చాలని ప్రజాప్రతినిధుల ఒత్తిడి 

నిజామాబాద్‌అర్బన్‌: పురుగు లు పట్టిన బియ్యం, ము క్కిన పప్పులు, పాడైన కారం, మసాలాలు, కు ళ్లిన కూరగాయలు.. వెరసి జిల్లా కేంద్రంలో ని మాలపల్లిలో గల సో ఫియా నిస్వాన్‌ మద ర్సా మెనూ. ఏంటి ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజ మే. మదర్సాలో గురువారం రాత్రి విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్‌ అయింది. దీంతో ఒకరు మృతిచెందగా, 13 మంది అస్వస్థతకు గురయ్యారు.

మదర్సాలోని సుమారు 20 మంది విద్యార్థులు మూడు రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. మదర్సా నిర్వాహకులు తాత్కాలికంగా మాత్రలను వేశారు. అయితే వారి ఆ రోగ్యం మెరుగుపడలేదు. గురువారం రాత్రి ఓ విద్యార్థిని జ నరల్‌ ఆస్పత్రికి తెచ్చారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా ఇక్కడికే తెచ్చా రు. చికిత్స పొందుతుం డగా నస్రుల్లాబాద్‌కు  చెందిన సుమాయఫిర్దొస్‌ అనే వి ద్యార్థిని మృతి చెందింది.

మరో 13 మంది అలీషామెహర్‌(కామారెడ్డి), సానియబేగం (చించోలి), సమ్రిన్‌సుల్తానా(సంగారెడ్డి), సీమ్రాన్‌(హీంగోలి), అస్మాఫాతిమా(బోధన్‌), రుక్యఫిర్దొస్‌(పెర్కిట్‌), రీనాఫిర్దొస్,నాబిహా(కోటగిరి), జుమేరాబేగం(కోటగిరి), సలీమబేగ్‌(కోటగిరి), జక్రినస్రా(హైదరాబాద్‌), అయేషా, సారాసుల్తానా (సం గారెడ్డి) ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.

వీరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉం దని వైద్యులు అన్నారు. అయితే బాధిత విద్యా ర్థుల బంధువులు నిర్వాహకులపై దాడికి యత్నించారు. సుమాయఫిర్ధొస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కాకుండానే తరలించారు. వైద్యాధికారులు, పోలీసులు పరిశీలించి మళ్లీ రాత్రి పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని తెప్పించారు.  

వస్తువులు మార్చేసిన నిర్వాహకులు

మదర్సాలో తనిఖీలు చేసిన ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ నివేదిక సిద్ధం చేస్తుండగానే నిర్వాహకులు పాత సామగ్రి స్థానంలో కొత్తవి తెచ్చారు. నివేదికను తమకు అనుకూలంగా ఇవ్వాలని ఓ ప్రజాప్రతినిధి అధికారిణిపై ఒత్తిడి తెచ్చారు.

అనుకూలమైన నివేదిక రాయలంటూ పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు సంఘటన స్థలంలో హంగామా చేశారు. ఇదిలా ఉండగా మదర్సాకు ఏసీపీ సుదర్శన్‌ వచ్చి వివరాలు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.  

మదర్సాలో 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి నిత్యం అప్రశుభ్ర ఆహారాన్నే అందిస్తున్నారు. ఈ సంఘటనతో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ అమృతశ్రీ తనిఖీ చేశారు. అనేక లోపాలు వెలుగులోకి వచ్చాయి.

బియ్యంలో పురుగులు, కుళ్లిన టమాటాలు, ముక్కిన పప్పులు, మసాలాలతో ఆహారం అందిస్తున్నట్లు వెలుగు చూసింది. శాంపుల్స్‌ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆహార పదార్థాలు ఏమాత్రం తినేందుకు వీలు లేవని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అన్నారు. 

అన్ని వస్తువులు పాడయ్యాయి.. 

మదర్సాలో ఆహార పదార్థాలు సక్రమంగా లేవు. కుళ్లిన టమాటలు, పురుగులు పట్టిన బియ్యం, పప్పులు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకున్నాం. 200 మంది విద్యార్థులకు సరిపోయేంత ఆహారం లేదు. వంటగది అపరిశుభ్రంగా ఉంది. పరీక్షల నిమిత్తం శాంపుల్స్‌ను హైదరాబాద్‌కు పంపుతున్నాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం.
–అమృతశ్రీ, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top