పంజాగుట్టలో అగ్ని ప్రమాదం

Fire Accident In Wine Shop At Punjagutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ క్రైమ్‌ : పంజాగుట్టలోని ఓ వైన్‌ షాపులో సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిమ్స్‌ హాస్పిటల్‌ దగ్గరలో ఉన్న డ్యూ పాయింట్‌ వైన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. చెలరేగుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారుగా రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top