మద్యం అప్పు ఇవ్వలేదని..

Fire Accident In Wine Shop Prakasam - Sakshi

సింగరాయకొండ: మద్యం అప్పు ఇవ్వలేదని కొందరు యువకులు ఆగ్రహించి బ్రాందీషాపులో పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ సంఘటన శుక్రవారం స్థానిక లారీ యూనియన్‌ ఆఫీసు వద్ద  జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాందీ షాపు నంబర్‌–196కు నలుగురు యువకులు వచ్చి మద్యం తాగారు. చాలక పోవడంతో పాటు వారి వద్ద డబ్బులు లేవు. మరికొంత మద్యం అప్పు ఇవ్వాలని షాపులోని కుర్రోడు నాగరాజుతో గొడవకు దిగారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి బి.నారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మిగిలిన యువకులు పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శీలం రవి అనే యువకుడు బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొచ్చి షాపులో పోసి నిప్పంటించాడు. ప్రమాదంలో వాటర్‌ ఫ్రిజ్‌తో పాటు సుమారు కేసు మద్యం ధ్వంసమైంది.  టంగుటూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు షాపులో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. షాపు యజమానులు ఎటువంటి సేఫ్టీ చర్యలు తీసుకోలేదని, దీనిపై జిల్లా అధికారికి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని అగ్నిమాపక అధికారి కొండయ్య హెచ్చరించారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మురళీధర్‌ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top