ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!

Fire Accident In Surat At Least 15 Dead - Sakshi

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ బిల్డింగ్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు.. విద్యార్థులు భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ఆరు ఫైర్‌ ఇంజన్లతో దాదాపు 18 మంది రక్షణ చర్యలు చేపట్టారు.

కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top