
కాలిపోయిన పరుపులు
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఎస్టీ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విద్యార్థుల పరుపులు, పుస్తకాలు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిపుడు పిల్లలెవరూ హాస్టల్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేదు. ఇన్వర్టర్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ కూడా అందుబాటులో లేరు..స్థానికులు గమనించి వెంటనే మంటలు ఆర్పడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది.