మద్యం మత్తులో పసికందు హత్య | Father Killed Daughter in Tamil Nadu | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పసికందు హత్య

Jan 19 2019 11:26 AM | Updated on Jan 19 2019 11:26 AM

Father Killed Daughter in Tamil Nadu - Sakshi

చిన్నారి మీరా, తండ్రి మదివాసన్‌ (ఫైల్‌)

చెన్నై, తిరువొత్తియూరు: మద్యం మత్తులో భార్యతో గొడవపడి నిద్రిస్తున్న మూడు నెలల ఆడ శిశువును హత్య చేసిన తండ్రిని పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా మ రక్కానం సమీపం తొట్టికుప్పం గ్రామానికి చెందిన మదివానన్‌ (30) భవన నిర్మాణ కార్మికుడు. అతను అదే ప్రాంతానికి చెందిన పొన్ని (27)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రదీప్‌ రాజ్‌ (2), మీరా (మూడు నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత మూడు రోజులుగా మదివానన్‌ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మదివానన్‌ ఎక్కువగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనిపై పొన్ని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడింది. దీంతో ఆగ్రహం చెందిన మదివానన్‌ నిద్రిస్తున్న మూడు నెలల పసిబిడ్డను నేలపైకి విసిరి కొట్టాడు. దీంతో పసికందు తీవ్రంగా గాయపడింది. దిగ్భ్రాంతి చెందిన పొన్ని, బంధువులు చిన్నారిని వెంటనే మరక్కానం ఆస్పత్రికి తీసుకెళ్లగా పసికందు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మరక్కాణం పోలీసులు కేసు నమోదు చేసి మది వానన్‌ను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement