రాజాసింగ్‌ ఫేస్‌బుక్‌ హ్యాక్‌ | Farmer Mla Raja Singh Lodha Facebook Account hacked | Sakshi
Sakshi News home page

రాజాసింగ్‌ ఫేస్‌బుక్‌ హ్యాక్‌

Oct 9 2018 9:30 AM | Updated on Oct 9 2018 9:30 AM

Farmer Mla Raja Singh Lodha Facebook Account hacked - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లోథా ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌ అయింది. దీనిపై ఆయన సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. రాజాసింగ్‌ తన పేరుతో ఓ ఫేస్‌బుక్‌ ఖాతా నిర్వహిస్తున్నారు. తన కార్యకలాపాలు, సందేశాలతో ఎప్పుడూ అప్‌డేట్‌ చేసే దీనిని దాదాపు ఐదు లక్షల మంది లైక్‌ చేయగా.. వేల మంది ఫ్రెండ్, ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ ఫేస్‌బుక్‌ ఖాతా రాజాసింగ్‌కు చెందిన ఓ మెయిల్‌తో లింకై ఉంది.

సోమవారం ఈయనకు హఠాత్తుగా ఆ ఫేస్‌బుక్‌ ఖాతాను అడ్మిన్‌గా మీరు నిర్వహించలేరంటూ ఓ ఈ–మెయిల్‌ సందేశం వచ్చింది. ఇది చూసిన ఆయన తన ఫేస్‌బుక్‌కు యాక్సస్‌ చేయడానికి ప్రయత్నించగా... పాస్‌వర్డ్‌ మారినట్లు గుర్తించాడు. ఈ నేపథ్యంలోనే తన ఫేస్‌బుక్‌ ఖాతాను కొందరు హ్యాక్‌ చేసినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై రాజాసింగ్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కుట్ర పూరితంగా ఫేస్‌ బుక్‌ హాక్‌ చేశారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఎంఐఎం పార్టీ నేతలే ఈ పని చేయించినట్లు ఆరోపించాడు. గోషామహల్‌ నుంచి తనను ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement