స్థల వివాదం : ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Family Dispute Three Committed Suicide In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని సంతపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంతపేటలోని ఓబులంపల్లి కాలనీలో రవి భార్య భువనేశ్వరి, కూతురు గాయిత్రి (9), తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఓ స్థలం విషయంలో కుటుంబంలో రెండు మూడు నెలలుగా గొడవ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని రవి, భువనేశ్వరి, గాయత్రి ప్రాణాలు తీసుకున్నారు. అయితే, స్థలం విషయంలో గొడవతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారా.. మరేదైనా కారణముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top