నకిలీ మహిళా సీఐ అరెస్ట్‌ | Fake Woman CI Arrest In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నకిలీ మహిళా సీఐ అరెస్ట్‌

Jul 18 2018 8:58 AM | Updated on Aug 20 2018 4:27 PM

Fake Woman CI Arrest In Tamil Nadu - Sakshi

అరెస్టయిన నకిలీ సీఐ గంగ

తిరువణ్ణామలై: తండ్రాంబట్టులో నకిలీ మహిళా సీఐను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు పోలీస్‌ స్టేషన్‌కు సోమవారం రాత్రి ఒక మహిళా సీఐ వచ్చారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న పోలీసుల వద్ద తాను చెన్నైలో సీఐగా పనిచేస్తున్నా. ఒక కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ పుస్తకాన్ని చూడాలని.. ఆ పుస్తకాన్ని ఇవ్వాలని కోరింది. ఆ సీఐ యూనిఫామ్‌పై పేరులేదు. కాలుకు షూ ధరించలేదు. దీంతో సిబ్బంది అనుమానంతో దండపాణి స్టేషన్‌ ఎస్‌ జయచంద్రన్‌కు సమాచారం అందజేశారు.

ఎస్‌ఐ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని ఆ నకిలీ పోలీస్‌ వద్ద విచారణ చేశారు. విచారణలో ఆమె తండ్రాంబట్టు గ్రామానికి చెందిన గంగ(24) అని తెలిసింది. పోలీస్‌ కావాలన్న ఆశయంతో రెండేళ్ల కిందట జరిగిన పోలీస్‌ ఎంపికకు జరిగిన రాత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో ఉద్యోగం రాలేదు. అవమానమని భావించి ఆరణిలోని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా చేరానని అందరితో చెప్పా. ఖర్చులకు నగదు అవసరమైతే ఒంటరిగా వస్తున్న వాహనాలను నిలిపి నగదు తీసుకుంటా. తిరువణ్ణామలై నుంచి తండ్రాంబట్టుకు ప్రైవేట్‌ బస్సులో టికెట్‌ తీసుకోకుండా వచ్చా. కండక్టర్‌కి అనుమానం రాకుండా బస్సును పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ఎక్కి, దిగే దాన్ని’అని తెలిపింది. పోలీసులు గంగను అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement