మీ ఇంట్లో రెడ్‌ లేబుల్‌ టీపొడి వాడుతున్నారా..? | Sakshi
Sakshi News home page

నకిలీ టీపొడి పట్టివేత

Published Fri, Apr 19 2019 7:47 AM

Fake Red Label Tea Powder Caught in Hyderabad - Sakshi

చాదర్‌ఘాట్‌: నకిలీ టీపొడి విక్రయిస్తున్న ఇద్దరు దుకాణదారులపై చాదర్‌ఘాట్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శేషు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృపామార్కెట్‌ లోని శ్రీపవన్‌ స్తుతి స్టోర్స్‌ నిర్వాహకుడు దినేశ్‌కుమార్‌ గోయెల్‌ నకిలీ రెడ్‌ లేబుల్‌ టీపొడి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడం తో కంపెనీ వినోద్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ నేపథ్యంలో షాప్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు  రూ.2 లక్షల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. 

మధ్యప్రదేశ్‌ నుంచి సరఫరా..
ఈ నకిలీ టీ పొడి మధ్య ప్రదేశ్‌ నుంచి నగరానికి సరఫరా అవుతుందని, బేగం బజార్‌ లోని సుమిత్రన్‌ ఏజెన్సీ అధినేత సర్దా క్రాంతి ద్వారా మలక్‌పేటలోని కృపామార్కెట్‌కు తరలించి అక్కడ నుంచి హోల్‌సేల్‌గా నగరంలోని దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులు సర్దా క్రాంతి, దినేశ్‌ కుమార్‌ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement