హైదరాబాద్‌: సినిమాహాల్లో యువతిపై అత్యాచారం | facebook friend rape attempt in movie theatre | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: సినిమాహాల్లో యువతిపై అత్యాచారం

Feb 2 2018 8:59 AM | Updated on Aug 11 2018 8:29 PM

facebook friend rape attempt in movie theatre - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్‌లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు నిందితుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి...

జనగాం జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన కే భిక్షపతి (23) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన (19) యువతి ఇంటర్‌ పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటుంది. భిక్షపతికి రెండు నెలల క్రితం ఆ యువతితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. జగద్గిరిగుట్టలో ఉండే చెల్లి దగ్గరకు బిక్షపతి తరచుగా వస్తుంటాడు. ఇలా రెండు మార్లు నగరానికి వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. గత నెల 28వ తేదీన నగరానికి వచ్చిన భిక్షపతి ఇద్దరు కలిసి బయటకు వెళ్లి వచ్చారు.

29వ తేదీ మరోమారు ఇద్దరు కలిసి ఇందిరాపార్కుకు వెళ్లి మధ్యాహ్నం సికింద్రాబాద్‌ పాస్‌ఫోర్ట్‌ ఆఫీస్‌ వద్ద ఉండే ప్రశాంత్‌ థియేటర్‌లో సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్‌లో మొత్తం 70 మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా నిందితుడు ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ యువతికి రక్తస్రావం అయింది. వెంటనే ఆ యువతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement