మద్యం మత్తులో మాజీ కార్పొరేటర్‌ కొడుకు బీభత్సం.. | Ex Corporator Son Rash Driving In Hyderabad | Sakshi
Sakshi News home page

Jun 16 2018 4:22 PM | Updated on Apr 3 2019 8:03 PM

Ex Corporator Son Rash Driving In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో శుక్రవారం అర్ధరాత్రి తెలుగు తల్లి విగ్రహం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు హిమాయత్‌నగర్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలివి.. మద్యం మత్తులో ఓ వ్యక్తి ర్యాస్‌ డ్రైవింగ్‌ చేయడంతో కారు ప్రమాదానికి గురైంది. ఆ కారు నడిపిన వ్యక్తి మాజీ కార్పొరేటర్‌ మధు గౌడ్‌ కుమారుడు అక్షయ్‌ కుమార్‌ గౌడ్‌ అని గుర్తించారు. మధు గౌడ్‌ మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ తమ్ముడు. మద్యం సేవించిన అక్షయ్‌ బాధితులను పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ప్రమాదంలో గాయపడిన వారు కావాడిగూడకు చెందిన సాయి, ఆకేశ్‌ గౌడ్‌లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement