అమ్మాయిలను టీజ్‌ చేశాడు.. దాంతో చితక్కొట్టేశారు

Eve Teaser Paraded Naked Thrashed By Women In Punjab Ambala City - Sakshi

చంఢీఘర్‌: నిర్భయ వంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా.. వారిపై భౌతిక, లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా పట్టణంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అంబాలాలో ముగ్గురు మైనర్ బాలికలను వేధించిన ఓ ఈవ్‌టీజర్‌ను మహిళలు పట్టుకొని బట్టలు విప్పించి దేహశుద్ధి చేశారు.

ముగ్గురు బాలికలు పాఠశాలకు వెళుతుండగా పవన్ అలియాస్ సోను అనే ఆకతాయి వారిని వెంటాడి లైంగికంగా వేధించాడు. బాలికలను వేధించిన ఘటన గురించి తెలుసుకున్న బాలికల కుటుంబ సభ్యులు ఆకతాయిని పట్టుకొని బట్టలు విప్పించి బహిరంగంగా రోడ్డుపై కొట్టారు. తరువాత అతన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడు పవన్‌‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్56, 12, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

చదవండి: దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్‌ రేప్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top