వీసా కోసం పెళ్లి నాటకం | Engagement Drama For Canada Visa in Hyderabad | Sakshi
Sakshi News home page

వీసా కోసం పెళ్లి నాటకం

May 16 2019 8:07 AM | Updated on May 16 2019 8:07 AM

Engagement Drama For Canada Visa in Hyderabad - Sakshi

ఉప్పల్‌: కెనడా వెళ్లడానికి వీసా కోసం తనతో నిశ్చితార్థం అయిన యువతితో కలిసి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని వీసా చేతికి వచ్చిన తర్వాత ఓ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు   ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.ఉప్పల్‌ కళ్యాణపురి ప్రాంతానికి చెందిన యువతితో నగరానికి చెందిన అరవింద్‌ కుమార్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నిశ్చితార్థం జరిగింది. కెనడా వెళ్లేందుకు గాను  త్వరగా వీసా తీసుకునేందుకు ఇద్దరు కలిసి రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీసా వచ్చిన తరువాత  అతను ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement