హిజ్రాల వీరంగం | Drunken Hijra Abusive Words on Police & Media | Sakshi
Sakshi News home page

హిజ్రాల వీరంగం

Feb 19 2018 2:53 AM | Updated on May 25 2018 2:06 PM

Drunken Hijra Abusive Words on Police & Media - Sakshi

పోలీసులతో గొడవ పడుతున్న హిజ్రా

హైదరాబాద్‌: ఇద్దరు హిజ్రాలు శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో వీరంగం సృష్టించారు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఓ హిజ్రా మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కృష్ణ అనే హిజ్రా తాగిన మైకంలో కారు డ్రైవ్‌ చేస్తుండగా పోలీసులు ఆపి శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించగా.. ఆల్కహాల్‌ 99 పాయింట్ల మోతాదుగా రికార్డైంది. దీంతో ఆ హిజ్రాపై కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. అదే సమయంలో పక్క సీట్లో కూర్చున్న మరో హిజ్రా రెచ్చిపోయి పోలీసుల్ని, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను దూషించారు. అసభ్య పదజాలంతో హడలెత్తించారు.

అరగంట పాటు బీభత్సం సృష్టించారు. మీడియా ప్రతినిధులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కెమెరాలు లాక్కొని నేలకేసి కొట్టారు. అంతటితో ఆగక తిట్ల దండకం అందుకున్నారు. ఈ హడావుడిలో కొందరు కెమెరామెన్‌ అదుపుతప్పి కింద పడిపోయారు. అరగంటపాటు అటు మీడియాపైనా, ఇటు ట్రాఫిక్‌ పోలీసులపైనా హిజ్రాలు విరుచుకుపడ్డారు. మొత్తం ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వీరి ధాటికి వెనుక ఉన్న వాహనదారులు కూడా హడలెత్తిపోయారు. కొంతమంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో బెంబేలెత్తిపోయిన పోలీసులు అర్ధంతరంగా తనిఖీలను ముగించి మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement