స్వామీజీకి వింత అనుభవం!

Driver Steals Swamiji Car When He Went to Toilet - Sakshi

సాక్షి, మేడ్చల్ : విశ్వనాథ పీఠాధిపతి విశ్వానాథ స్వామీజీకి సోమవారం వింత అనుభవం ఎదురైంది. శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై స్వామిజీ కారును సొంత డ్రైవరే తస్కరించే ప్రయత్నం చేశాడు. స్వామీజీ మూత్ర విసర్జనకు దిగిన సమయంలో డ్రైవర్‌ కారుతో ఉడాయించాడు. దీంతో స్వామీజీ శామీర్‌ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు జీపీఆర్‌ఎస్‌ సాయంతో కారు పటాన్‌ చెరులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన నిందితుడు కారును పటాన్‌చెరువు రహదారిపై వదిలేసి పరారయ్యాడు. అందులో ఉన్న రూ.40 వేల నగదు, ఏటీఎం కార్డులు తీసుకెళ్లాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వామీజీకి అప్పగించి.. నిందితుడు కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top