వైద్యం పేరుతో వికృత చేష్టలు  | Doctor Indecent Behavior On young Woman In West Godavari | Sakshi
Sakshi News home page

వైద్యం పేరుతో వికృత చేష్టలు 

Jun 30 2020 12:51 PM | Updated on Jun 30 2020 12:53 PM

Doctor Indecent Behavior On young Woman In West Godavari - Sakshi

ఏలూరు టౌన్‌:  ఏలూరు నగరం వన్‌టౌన్‌ ప్రాంతంలో ఒక యువతిపై వైద్యం పేరుతో లైంగిక దాడికి ప్రయత్నించిన పారామెడికల్‌ వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు వన్‌టౌన్‌ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్‌ నవాబ్‌పేట మారుతీనగర్‌ ప్రాంతంలో క్లినిక్‌ను పి.సత్యానందం నిర్వహిస్తున్నాడు. అతను ఏలూరు ఆర్‌ఆర్‌పేటలోని ఒక కంటివైద్యశాలలో పారామెడికల్‌ వైద్యునిగా పనిచేస్తున్నాడు. స్థానికంగానూ క్లినిక్‌ నిర్వహిస్తూ వైద్యం అందిస్తున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన ఒక యువతి తలనొప్పితో బాధపడుతూ ఆదివారం క్లినిక్‌కు వచ్చింది. మరోసారి సోమవారం తన తమ్ముడిని తీసుకువెళ్లింది. అయితే వైద్యుడు సత్యానందం యువతికి ఒక ఇంజెక్షన్‌ చేశాడు. తల తిరుగుతుందని, కొంచెం సేపు ఓర్చుకోవాలంటూ ఆమెకు చెప్పాడు. ఇదే క్రమంలో ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడంతో యువతి గట్టిగా కేకలు వేసింది. బయట ఉన్న యువతి సోదరుడు లోనికి వెళ్లి అడ్డుకున్నాడు. బంధువులకు సమాచారం ఇవ్వటంతో వారంతా క్లినిక్‌ వద్దకు చేరుకుని వైద్యునికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఎస్సై రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement