ఎస్సీఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌

Dlit Leaders Demand SC ST Attrocity Case Will File Against Bhanupriya - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : పనిమనిషి వివాదం సద్దుమణగకముందే మరో సమస్యలో చిక్కుకున్నారు సినీ నటి భానుప్రియ. ఆమె మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు దళిత, ప్రజా సంఘాల నేతలు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాలు.. వడ్లమూరుకు చెందిన ఇద్దరు దళిత మైనర్‌ బాలికలతో భానుప్రియ వెట్టి చాకీరి చేయించుకున్నారంటూ భానుప్రియతో పాటు ఆమె తల్లి, సోదరుని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు.. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ కింద కూడా కేసులు నమోదు చేయాలంటూ దళిత, ప్రజా సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

ఇటీవల పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ తన కుమార్తెను వేధిస్తున్నారంటూ భానుప్రియ, ఆమె సోదరుని మీద సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభావతి కుమార్తె తన ఇంట్లో దొంగతనం చేసిందని.. ఆ విషయం అడిగినందుకు తమ మీద తప్పుడు కేసులు పెట్టిందంటూ భానుప్రియ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top