
హైందవి(ఫైల్)
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి హైందవి(21) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. హైందవి కరీంనగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలో బీఎస్సీ కోర్సు ఇటీవలే పూర్తిచేసింది. ఇంటివద్ద ఉంటూ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పితో శరీరం రోజురోజుకి బలహీనంగా మారుతుందని మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కడుపునొప్పితో విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు హైందవి సూసైడ్ నోట్ రాసింది. సంఘటన స్థలాన్ని ఎస్సై నాగేశ్వర్‌రావు పరిశీలించారు. మృతురాలి తండ్రి హన్మంతరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.