అక్రమ సంబంధం.. హత్య

Destroy lives with improper relationships - Sakshi

హతురాలు.. సొంత వదినే

వైట్‌ఫీల్డ్‌: డబ్బు ఇతరత్రా ప్రలోభాలతో మానవత్వానికే మచ్చ తెస్తున్నారు కొందరు. అర్థంపర్థం లేని అక్రమ సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తన అన్న మరణించడంతో అతని భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి... డబ్బు విషయంలో గొడవ పడి ఆమెను గొంతు కోసి చంపాడు. మంగళవారం ఈ సంఘటన రాజగోపాలనగర పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. గణపతినగరంలో నటరాజ అనే వ్యక్తి వెల్డింగ్‌ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. అతని అన్న కొంతకాలం కింద చనిపోవడంతో వదిన సరోజమ్మతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు.

సరోజమ్మ అతని వద్ద అప్పుడప్పుడు కొంత డబ్బు తీసుకుంది. ఆమె సమీపంలోని గార్మెంట్స్‌లో పనిచేసేది. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని నటరాజ పలుమార్లు సరోజమ్మను ఒత్తిడి చేయసాగాడు. గత నెల 30వ తేదీన సరోజమ్మ, నటరాజకు డబ్బు విషయమై వివాదం చెలరేగింది. ఆగ్రహంతో నటరాజ కత్తితీసుకుని సరోజమ్మ గొంతు కోసి చంపాడు. నిందితుడు నటరాజను అదుపులోకి తీసుకున్న రాజగోపాలనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top