ఫ్యాషన్‌ డిజైనర్‌ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

Delhi Woman Drives Car Wrong Side And Crushed A Woman - Sakshi

రాంగ్‌రూట్‌లో వచ్చి మహిళను తొక్కించేసిన యువతి

సాక్షి, న్యూఢిల్లీ : నిర్లక్ష్యంగా రాంగ్‌సైడ్‌లో వాహనం నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఓ యువతి. లగ్జరీ ఎస్‌యూవీని కారు అడ్డదిడ్డంగా నడుపుతూ.. ఓ మహిళ ఢీకొట్టి తొక్కించేసింది. దీంతో ప్రమాదస్థలిలోనే ఆమె ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని కనాట్‌ ప్లేస్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రేయా అగర్వాల్‌ లగ్జరీ ఎస్‌యూవీ (స్పోర్ట్ష్‌ యుటిలిటీ వెహికల్‌) కారును రాంగ్‌రూట్‌లో నడుపుతూ..  ఫూల్‌వతి అనే 50 ఏళ్ల మహిళను ఢీకొట్టింది.

ఆదివారం రాత్రి శివాజీ స్టేడియం బస్‌ టెర్మినల్‌ వద్ద గల ఓ రెస్టారెంట్‌ ముందు ఫూల్‌వతి నిల్చుని ఉండగా.. అజాగ్రత్తగా వాహనం నడుపుతూ.. ఆమెపైకి శ్రేయ దూసుకుపోయింది. ఆమెను ఢీకొట్టడమే కాకుండా.. దాదాపు 300 మీటర్లు కారుతో ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఫూల్‌వతి అక్కడిక్కడే మృతిచెందారు. దగ్గరలోని చెక్‌ పోస్టు వద్ద విధుల నిర్వర్తిస్తున్న పోలీసులు విషయాన్ని గ్రహించి నిందితురాలిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసి.. కేసు నమోదు చేశామని వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top