33 ఏళ్ల క్రితం తల్లిని చంపి: ఇప్పుడు కొడుకును.. | Delhi Man Shoots Son Over Argument On Drinking Habit | Sakshi
Sakshi News home page

మందు కోసం అప్పుడు తల్లిని, ఇప్పుడు కొడుకును

May 13 2020 8:51 AM | Updated on May 13 2020 9:00 AM

Delhi Man Shoots Son Over Argument On Drinking Habit - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శిక్ష అనుభవించి ఇంటికి తిరిగొచ్చినా అతనిలో మార్పు రాలేదు...

న్యూఢిల్లీ : మందు మానేయమన్నందుకు 33 ఏళ్ల క్రితం తల్లిని చంపేసిన ఓ వ్యక్తి అదే కారణంగా ఇప్పుడు కొడుకును తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీ రోహినీ ఏరియాకు చెందిన ప్రాపర్టీ డీలర్‌ ఓమ్‌పాల్‌ మ​ద్యానికి బానిస. 1987లో మద్యం తాగొద్దని హెచ్చరించిన తల్లి మాయాదేవిని చంపి జైలుపాలయ్యాడు. శిక్ష అనుభవించి ఇంటికి తిరిగొచ్చినా అతనిలో మార్పు రాలేదు.. మద్యం తాగటం మానలేదు. శనివారం భార్య పవిత్రా దేవీ అతన్ని మద్యం మానేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ( బండి సంజయ్‌పై కేసు నమోదు )

దీంతో అతడి కుమారుడు అడ్డం వచ్చి, తండ్రితో చర్చకు దిగాడు. ఇది కాస్తా ఇద్దరి మధ్యా గొడవకు దారితీసింది. ఆగ్రహానికి గురైన ఓమ్‌పాల్‌ లైసెన్స్‌డ్‌ తుపాకితో కుమారుడ్ని కాల్చిచంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఓమ్‌పాల్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి వద్దనుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ( కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement