డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య | Degree Student Commits Suicide in Krishna | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మహత్య

Jan 31 2020 11:22 AM | Updated on Jan 31 2020 11:22 AM

Degree Student Commits Suicide in Krishna - Sakshi

సమ్మెట అనిత మృతదేహం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): అనుమానాస్పదస్థితిలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సుల్తానగరంలో గురువారం చోటుచేసుకుంది. బందరు రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుల్తానగరానికి చెందిన సమ్మెట అనితాసాయిలక్ష్మి (20) మచిలీపట్నం బాలసాయి డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. తండ్రి శ్రీనివాసరావు డొకిపర్రు దేవాలయంలో పనిచేస్తున్నాడు. ఉదయం అనిత ఇంట్లో ఉండగా తల్లిదండ్రులు బ్యాంకులో పని నిమిత్తం మచిలీపట్నం వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా అనితా ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆమెను బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మీనరసింహమూర్తి సందర్శించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement