ఈ ఘాతుకానికి బాధ్యులెవరు?

dead leopard found by forest personals in Chittoor forest - Sakshi

సాక్షి, చిత్తూరు : రాష్ట్రంలో ఒకవైపు మాఫియా ప్రకృతి వనరులను కొల్లగొడుతుంటే, మరోవైపు వేటగాళ్లు వణ్యప్రాణును హరిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయిన చిరుతపులి కళేబరాన్ని సిబ్బంది గుర్తించారు. వివరాల్లోకి వెళితే..

పీలేరు మండలం తలుపుల గ్రామపంచాయితీ పరిధిలోని సళ్లవాండ్లపల్లి అటవీ ప్రాంతంలో మరణించిన చిరుత పులిని అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఉచ్చులోపడ్డ చిరుతను చంపి, దాని కాలిగోర్లను కత్తిరించి, కళేబరాన్ని ఓ గుంతలో విసిరేసి వెళ్లారు. చనిపోయిన చిరుత వయసు సుమారు ఎనిమిదేళ్లు ఉండొచ్చని అధికారులు చెప్పారు.

పోస్ట్‌మార్టం అనంతరం ఖననం : గుంతలో లభించిన చిరుత కళేబరాన్ని అటవీ శాఖ సిబ్బంది బయటకు తీయగా, పశువైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం చిరుతను సమీప ప్రాంతంలో ఖననం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరనేదానిపై విచారణ చేపట్టామని అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top