మామను చంపిన కోడలు

Daughter in law Killed Uncle in Orissa - Sakshi

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఒడిశా, జయపురం: జయపురం సమితిలోని బాట జగన్నాథపూర్‌ గ్రామంలో మామను చంపిన కోడలి ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. కోడలు ఒక ఇనుప రాడ్డుతో మామ చక్రజాని(50)ని మోదగా ఆయన మరణించినట్లు జయపురం సదర్‌ పోలీస్‌ స్టేషన్లో శుక్రవారం అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హుటాహుటిన గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ హత్య ఎలా జరిగింది?  ఎందుకు జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు పూర్తయన తరువాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.  పోస్ట్‌మార్టం కోసం చక్రజాని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top