అంతా ఆన్‌లైన్‌లోనే..

Cricket Betting Gang Arrested In Kurnnol - Sakshi

క్రికెట్‌ బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్‌  

రూ. 2.20 లక్షలు,రెండు సెల్‌ఫోన్స్, టీవీ స్వాధీనం

బ్యాంకు లావాదేవీలతో వెలుగులోకి..

కర్నూల్, ఎమ్మిగనూరురూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. పందెం కాయడం నుంచి డబ్బు పంపిణీ వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. దీనిపై కన్నేసిన పోలీసులు పక్కా సమాచారం మేరకు బెట్టింగ్‌రాయుళ్లను పట్టుకుని కటకటాల వెనక్కునెట్టారు. గురువారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ జీ.ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు.కొద్ది రోజులుగా అన్‌లైన్‌లో గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్‌ నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నందవరం ఎస్‌ఐ జగన్‌మోహన్, హెడ్‌కానిస్టేబుల్‌ రాముడు, కానిస్టేబుల్స్‌ దశరధరాముడు, గంగన్న, సోమశేఖర్, సుభాన్‌ టీమ్‌గా ఏర్పడి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా అనుమానితుల ఫోన్‌కాల్స్, బ్యాంక్‌ లావాదేవీలపై కన్నేశారు.

ఈక్రమంలో కీలక బుకీ సైఫుల్లా బ్యాంకు ఖాతా నుంచి మరో బుకీ జాకీర్‌హుసేన్‌ ఖాతాకు రోజూ పెద్దమొత్తంలో లావాదేవీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గాంధీనగర్‌లో ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి బెట్టింగ్‌ నిర్వహిస్తున్న సైఫుల్లా, దస్తగిరి, హాలహర్వికి చెందిన నిజామీన్, బూదురుకు చెందిన రవికుమార్‌కు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ. 2.20 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్స్, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మరో బుకీ జాకీర్‌హుసేన్‌ కదలికలపై నిఘా ఉంచామని, త్వరలో అతడిన పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసును చేధించిన పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌ను ఈ సందర్భంగా సీఐ అభినందించారు. సమావేశంలో పట్టణ, రూరల్‌ ఎస్‌ఐ హరిప్రసాద్, ధనుంజయ్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top