క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు | Cricket Betting Gang Arrest in Anantapur | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్ల అరెస్టు

May 9 2019 11:00 AM | Updated on May 9 2019 11:00 AM

Cricket Betting Gang Arrest in Anantapur - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

అనంతపురం, పెనుకొండ రూరల్‌: క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేసినట్లు పెనుకొండ సీఐ బి.రామకృష్ణ, ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,17,800 నగదు, ఒక ఎల్‌ఈడీ టీవీ, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మునిమడుగు గ్రామానికి చెందిన వెంకటరాముడు, తుపాకుల నరసింహ, గుట్టూరుకు చెందిన చిన్న ఆంజనేయులు, ఎరికల శివ, కురుబవాండ్లపల్లికి చెందిన లింగమయ్య, పెనుకొండకు చెందిన అబ్దుల్లా, లక్ష్మీనారాయణ, శ్రీనాథ్‌లు అందరూ కలసి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఫోన్‌ల ద్వారా ప్రతి బాల్‌కు సిక్స్, ఫోర్, వికెట్‌ అంటూ పందెం కాస్తున్నారన్నారు. మ్యాచ్‌లో ఫలానా జట్టు గెలుస్తుంది, ఓడుతుందని బెట్టింగ్‌ ఆడుతూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఒక వేళ ఎవరైనా బెట్టింగ్‌లో గెలిస్తే వారికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారన్నారు. తమకందిన సమాచారంతో డీఎస్పీ ఐ.రామకృష్ణ ద్వారా సర్చ్‌ వారంట్‌ తీసు కుని మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సదరు ఇంటిని సోదా చేశామన్నారు. ఆధారాలు లభించడంతో వారిని అరెస్టు చేశామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, నాగేంద్రప్రసాద్, లక్ష్మి  పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement